తిరుపతి: ఏడేళ్ల బాలిక పట్ల 50 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన

73చూసినవారు
తిరుపతి: ఏడేళ్ల బాలిక పట్ల 50 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన
ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురానికి చెందిన 3వతరగతి చదువుతున్న బాలిక దసరా సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంది. బాలిక తల్లి శనివారం పనికి వెళ్లింది. వారి ఇంటిపక్కనే నివాసమున్న 50ఏళ్ల ప్రసాద్ ఒంటరిగా ఉన్న బాలికను ఇంట్లోకి పిలుచుకుని అసభ్యకర వీడియోలు చూపిస్తూ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

సంబంధిత పోస్ట్