రామచంద్రాపురం మండలం గణేషపురం పంచాయతీ గుండోడుకణం రోడ్డు నిర్మాణ పనులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3. 15కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే 30గ్రామాల ప్రజలు తిరుపతికి వెళ్లడానికి 7కి. మీ దూరం తగ్గుతుందన్నారు. గతంలో కార్వేటినగరం రాజులు ఈ రోడ్డు మీదుగా తిరుమలకు వెళ్లే వారన్నారు.