ప్రజలు మెచ్చిన నాయకుడు చంద్రబాబు అని చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు కొనియాడారు. మంగళవారం ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబుకు ప్రసాద్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.