శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో హైకోర్టు జడ్జి

68చూసినవారు
శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో హైకోర్టు జడ్జి
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శనివారం రాత్రి హైకోర్టు జడ్జీ జస్టిస్ బివిఎన్ఎన్. చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్