ఆధునిక టెక్నాలజీతో సుస్థిర వ్యవసాయం సాధ్యమని అనంతపురం జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు రవి అన్నారు. చంద్రగిరి మండలం ఎ. రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సుస్థిర వ్యవసాయం కోసం పునరుత్పాదక శక్తి, డిజిటల్ సాంకేతికతను సమీకృతం చేయడంపై ఆవిష్కరణలు, అనువర్తనాలు అంశంపై సదస్సు నిర్వహించారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, మోహన్ బాబు యూనివర్శిటీ రూరల్ డెవలప్ మెంట్ క్లబ్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించారు.