చిత్తూరు నగరంలో సీఆర్ఆర్ పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లులలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులంతా పండగ వాతావరణంలో ఆనందంగా గడిపారు. ప్రిన్సిపాల్ మమతనాథ్ మాట్లాడుతూ మన పండుగుల్లో సంక్రాంతి పండుగ సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుందని అన్నారు.