ఈ నెల 21న జిల్లా చిత్తూరులో ఎస్సీ వర్గీకరణ విషయమై వన్ మెన్ కమిషన్ రాజు విద్యా మిశ్రా వస్తున్నారు. ఈ సందర్భంగా మాదిగలు హాజరై వారికి వినతి పత్రాలు సమర్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ మంగళవారం పిలుపునిచ్చారు. చిత్తూరులో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు, మాదిగ ఉపకులాలు తీవ్ర అణిచివేతకు గురి అవుతున్నట్లు వెల్లడించారు.