ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

76చూసినవారు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రభావతి దేవి చిత్తూరు నగర పరిధిలోని వెంగళరావు నగర్ ఏరియాలలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ దోమల లార్వాలను అరికట్టితే గాని డెంగీ, మలేరియా, చికున్ గున్యా మొదలగు జ్వరాలు రాకుండా చేయగలమని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసివేయాలని, వేపాకు పొగ వేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్