చిత్తూరు సమీపంలోని మొగిలి ఘాట్ నందు ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ రహదారులు, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ. మొగిలి ఘాట్ వద్ద చెక్ పోస్టుతో పాటు ఒక అంబులెన్స్, క్రేన్ ను అందుబాటులో ఉంచాలన్నారు. హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.