జిల్లా సబ్ జైలును పరిశీలించిన జిల్లా ఎస్పీ

79చూసినవారు
జిల్లా సబ్ జైలును పరిశీలించిన జిల్లా ఎస్పీ
చిత్తూరు నగరంలోని జిల్లా సబ్ జైలును జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జైలు భద్రత గురించి వివరించారు. ఖైదీలకు సురక్షితమైన, నైతిక పరిరక్షణను కల్పించడంలో జైలు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. అనంతరం జిల్లాలోని సీసిటీవీ కెమెరాలు, గార్డులు చేపడుతున్న పర్యవేక్షణ, రాత్రి వేళ రక్షణా చర్యలపై విస్తృతంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్