చంద్రబాబు అనుభవం అందరికీ తెలిసిందేనని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు భక్తుల మనోభావాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని నిజానిజాలు తెల్చేందుకు సీబీఐ, సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. దేవుని మీద భక్తితో వస్తున్న జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడగడం భావ్యం కాదని అన్నారు.