గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని తయ్యూరు ఇలవేల్పులో శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి దసరా ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు చిత్తూరు ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావు అమ్మవారికి పట్టు వస్త్రాలను మేళ తాళాలతో ఊరేగింపుగా సమర్పించారు. ఆలయ ఈవో తిమ్మారెడ్డి పూర్ణకుంభంతో ఎంపీకి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.