చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఉడమలకుర్తి ప్రాథమిక పాఠశాల ఆవరణంలో శుక్రవారం పెద్ద పెద్ద వృక్షాలను నరికేసి తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే ఉడమలకుర్తి వాగు కాలువ పక్కన ఉన్న చెట్లంతా కొందరు మావే అని వ్యాపారుస్తులకు అమ్మేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్లతో పాటు వీటిని నరికేసి సుమారు నూరు టన్నులపైన కలపను తమిళనాడు రాష్ట్రానికి తరలించారు.
దీనిపై ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు ఉడుములకుర్తి ప్రాథమిక పాఠశాల వద్దకు రాగానే అక్కడ ఉన్న కలప వ్యాపారుస్తులు అందరూ పరారయ్యారు. దీనిపై విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారి సతీష్ తెలిపారు. అలాగే పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపించారు. ఇలాంటి కలప వ్యాపారస్తులను కట్టడి చేయాలి. లేకుంటే పకృతి వినాశనమే అవుతుందని గ్రామస్తులు ఆరోపించారు.