షికారుల అభ్యున్నతికి ప్రభుత్వం

1366చూసినవారు
షికారుల అభ్యున్నతికి ప్రభుత్వం
షికారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మండలంలోని 50 బసివిరెడ్డిపల్లి షికారి కాలనీలో మేరి క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ శాంతి దూత ఏసుప్రభు ప్రపంచంలో శాంతి స్థాపన చేశారని, ఆయన సిద్ధాంతాలు ఆలోచనలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తు, లౌకిక సమానత్వం , సౌబ్రతత్వం, కాపాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. షికారులకి నవరత్నాలు భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా కల్పించి ఇల్లు మంజూరు చేసి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు అల్లమ్మ మాట్లాడుతూ తుఫాను సమయంలో ప్రభుత్వం మాకు అండదండలు సహాయ సహకారాలు అందించిందని, మాకు కావలసిన భోజన సదుపాయం నిత్యవసర వస్తువులు అందించారన్నారు. గతంలో మాకు ఏ ప్రభుత్వం వచ్చిన తగిన గుర్తింపు ఇచ్చేవి కావాలి అన్నారు. జగనన్న ప్రభుత్వంలో మాకు అన్ని పథకాలు అందుతున్నాయని, సమాజంలో ప్రతి ఒక్కరు మమ్మల్ని గౌరవిస్తున్నారని, మాకు కావలసిన వనరులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తు, మళ్లీ మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని తన సంతోషాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి తెలియజేసింది. అనంతరం షికారులకి నూతన దుస్తులు, నిత్యవసర వస్తువులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ వరదమ్మ, పాస్టర్ తులసిమని, ఏసు నాదం, డేవిడ్, నాయకులు గండుమణి, బాబు, యోగానందం, చిరంజీవి, విక్టర్, తదితరుల పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్