ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదే గృహ సంరక్షకులు

1622చూసినవారు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదే గృహ సంరక్షకులు
శ్రీరంగరాజపురం: రానున్న 2024 ఎన్నికలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలకు వారధిగా గృహ సంరక్షకులు వ్యవహరించి గెలిపించాల్సిన బాధ్యత ఉందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఉద్బోధించారు. బుధవారం మండలంలోని పుల్లూరు క్రాస్లో ఎస్ ఎల్ వి కళ్యాణ మండపంలో గృహ సంరక్షకులు, వాలంటీర్లకు 2024 ఎన్నికలపై దిశ నిర్దేశం సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ''మా నమ్మకం నువ్వే జగనన్న'' కార్యక్రమాన్ని గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలపై నివృత్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగిన అభివృద్ధికి దిక్సూచిగా ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని ప్రజావేదిక ద్వారా వారి వారి కుటుంబానికి వెళ్లి సీఎం అందించిన పథకాల పై ఎంత మేరకు లబ్ధి అందిందో, లబ్ధి అందిన వాటికి ప్రజలు ఇచ్చే మార్కులు ఎంతో గృహ సంరక్షకులు, వాలంటీర్లు నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే ఉందని ఆ లోగా ప్రజల ద్వారా ఉన్న సమస్యలను గుర్తించి వాటి అమలకు నాయకులు, గృహ సంరక్షకులు, వాలంటీర్లు కృషి చేయాల్సి ఉందన్నారు. ఇటీవల గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ యోగాల పాదయాత్రలో తనపై భూ ఆక్రమణ ఆరోపణలు సంధించడం సిగ్గుచేటు అన్నారు. తనకు, తన స్వగ్రామంలో 200ఎకరాలు అక్రమ భూమి కలిగి ఉందని నిరూపిస్తే ఇప్పటికిప్పుడే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సభాముఖంగా తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్కు గృహసారథిలపై నమ్మకం ఉందని, తద్వారా 2024 ఎన్నికల సమాయత్తానికి గృహ సారధుల అవగాహన సదస్సు కీలకమన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఒక బ్రాండ్ గా రాష్ట్రంలో తయారయిందని, వాటిని ఆపడానికి ఏ రాజకీయ శక్తి ముందుకు రాదన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మనీ, జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, మాజీ జడ్పిటిసి గురవారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, నియోజక వర్గ కాపు సంఘ నేత విజయబాబు, నాయకులు జనార్ధన్, పత్తి గుణశేఖర్ నాయుడు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు దిలీప్ రెడ్డి, డిసెంబర్ శెట్టి, గృహ సంరక్షణ వారధిలు, వాలంటీర్లు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్