చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పెనుమూరు మండలంలోని సామిరెడ్డిపల్లి ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. అనంతరం స్థానిక ప్రజలు గృహాలు, వీధి దీపాలు, రేషన్ కార్డులు తదితర సమస్యలను ఆయనకు తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.