మండలంలోని ఉడుములకుర్తి పంచాయతీ పి. వి. పురం దళితివాడ గ్రామానికి గత ఏడాది సైక్లోన్ ప్రభావం చేత నష్టపోయిన పొలాలను పంటలను జిల్లా కలెక్టర్ హరి నారాయణ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి సందర్శించినప్పుడు గ్రామస్తులు స్మశానానికి రహదారి కావాలని కోరడంతో స్పందించిన కలెక్టర్ డిప్యూటీ సీఎం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్మశానానికి రహదారి కూడా 15 అడుగుల వెడల్పుతో రహదారి సౌకర్యం కల్పించారు. ఈ రహదారిని అదే గ్రామానికి చెందిన టిడిపికి చెందిన ఏలుమలై, చిన్నబక్కయ్య, స్మశానానికి ఏర్పాటుచేసిన రహదారిని చనిపోయిన మృతదేహాన్ని స్మశానానికి పోనీయకుండా రోడ్డు అడ్డంగా గోతులు త్రవ్వడం జరిగింది. సంబంధిత విషయంపై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులు స్మశాన సమస్యను డిప్యూటీ సీఎం నారాయణస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి రహదారి అడ్డంగా గోతులు తవ్విన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రహదారి సౌకర్యం కల్పించాలని రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు సూచించారు. డిప్యూటీ సీఎం చెప్పిన స్పందించకుండా రెవెన్యూ సిబ్బంది నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్ తో కలిసి తాసిల్దార్ కి విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు అడ్డంగా గోతులు తవ్విన వ్యక్తులను కఠినంగా శిక్షించి, స్మశానానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.