గంగాధర నెల్లూరు మండలంలోని మండల కేంద్రం ఇటీవల అనారోగ్యంతో ఎలక్ట్రికల్ లైన్మెన్ వెంకటస్వామి ఆదివారం ఉదయం వారి స్వగృహంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న తెలంగాణ మాజీ పోలీస్ శాఖ ఉపాధ్యక్షుడు ఎస్సై గోవిందరావు మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నివాళులర్పించిన వారిలో సాయి వర్షిత, మనియానంపల్లి గ్రామస్తులు హనుమంతు, ఆంజనేయులు, సుధా, మునికృష్ణ, సురేంద్రబాబు, ప్రసాద్, మురళి, మురుగేష్, ఆర్య, దిలీప్, ప్రసాద్, రెడ్డప్ప, ఈశ్వర్ తదితరులు నివాళులర్పించారు.