శ్రీరంగరాజపురం: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని మర్రిపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు భార్య బికయ్య భార్య మునెమ్మ(75) వడదెబ్బతో మృతి చెందడం జరిగింది. గత వారం రోజులుగా ఎండ విపరీతంగా పెరగడంతో పొలం కి వెళ్లిన మునెమ్మ భానుడి ప్రభావం తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు గమనించి ప్రధమ చికిత్స చేయగా అంతలోనే మరణించడం జరిగింది. ఆమె మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.