గూడూరు రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఉన్న ప్రశాంత్ నగర్ లో సోమవారం తొమ్మిదేళ్ల మైనర్ ముస్లిం బాలికను ఓ యువకుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం 100 కు, అదేవిధంగా విఆర్ఓకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిసింది.