కుప్పం పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల వెడల్పు, విస్తరణ అవసరమని కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ చెప్పారు. శుక్రవారం టిడిపి నాయకులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల ఇరుకైన ప్రాంతాలు, ప్రజల ఇబ్బందులు గుర్తించిన ఆయన, రోడ్ల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు. అవసరమైన నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తామని అన్నారు.