చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమల ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది. ఈ క్రమంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మంగళవారం నిరసన తెలిపారు. గత 15 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు వాపోయారు. వీళ్ల నిరసనతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక టీడీపీ నేతలు మహిళలకు నచ్చచెప్పి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. దాంతో నిరసన విరమించారు.