ఓటర్ వెరిఫికేషన్ కు సంబంధించి రెండు రోజులపాటు జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. కుప్పం ప్రాంతంలో శనివారం పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఓటర్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. కొత్త ఓట్ల చేర్పు అదేవిధంగా ఓటర్ల తొలగింపు మార్పులకు సంబంధించి శనివారం, ఆదివారాలల్లో ఓటర్లు తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేయాలన్నారు.