కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వికాస్ మర్మత్ సోమవారం కడా కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తమకు తెలియజేయాలని, ప్రతి సోమవారం కడా కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తామని వికాస్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.