మదనపల్లి బీటీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 14వ రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ పోటీలలో కడప, అనకాపల్లి టీములు ఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. రాష్ట్రస్థాయి హాకీ పోటీలను గత రెండు రోజులుగా మదనపల్లిలో నిర్వహిస్తున్నారు. కృష్ణ, ఎన్టీఆర్, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, కాకినాడ, తిరుపతి జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం ఫైనల్ పోటీలు జరగనున్నాయి.