కూనమరాజుపాలెం: ధనలక్ష్మి అవతారంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు

74చూసినవారు
కూనమరాజుపాలెం: ధనలక్ష్మి అవతారంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులను కటాక్షించారు. ఆలయాన్ని పూర్తిగా కరెన్సీ నోట్లతో అత్యంత వైభవంగా అలంకరించారు. హోమాలు కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దూప దీప నైవేద్యాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ వారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్