వడమాలపేట మండలం, పూడి క్రాస్ రోడ్లో వెలసిన అంకాళపరమేశ్వరి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా మహాదేవుని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. ఆలయ ధర్మకర్త పీతాంబరం ఆచారి అన్నదానం చేశారు