నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కళాకారులు తులసీ బాయి, హరికథ కుటుంబేష్, భాగవతారు శ్రోతలను విశేషంగా అలరించారు.