నగరి పట్టణంలోని కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి గోదాదేవి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కల్యాణోత్సవానికి పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.