నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుండి విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు.