తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం నగిరి నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి సెలవు ప్రకటించారు. సెలవు రోజు ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటివద్దే జాగ్రత్తగా చూసుకోవాలని అధికారి తెలిపారు.