పుత్తూరు: సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

64చూసినవారు
పుత్తూరు: సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు
నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం తొర్రూరులోని మహిమాన్వితమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్థి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక ఆలయంలో పలు రకాల హోమాలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. అంతేకాకుండా శుక్రవారం సంకటహర చతుర్థి అరుదుగా వస్తుందని తెలిపారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్