పుత్తూరు రూరల్ మండలం సిరుగురాజుపాలెం గ్రామపంచాయతీ పొట్టిగుట్టల సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి పూర్తిగా నీళ్లు నిలిచిపోవడంతో దిగువగుళ్ళురు, ఎగవగుళ్ళురు ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు పక్క పెద్ద వృక్షం కూలిపోయి విద్యుత్ స్తంభంపై పడడంతో రెండు రోజులుగా కరెంటు లేకుండా ప్రజలు విలవిలాడుతున్నారు. త్రాగడానికి నీళ్లు కూడా లేవని ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.