వైసీపీని వీడబోతున్నట్లు ప్రచారం.. అందరికీ షాకిచ్చిన రోజా

65చూసినవారు
వైసీపీని వీడబోతున్నట్లు ప్రచారం.. అందరికీ షాకిచ్చిన రోజా
నగరి మాజీ ఎమ్మెల్యే రోజా వైసీపీని వీడుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మెసేజ్ అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. ఇవాళ వైసీపీ అధినేత జగన్, భారతిల పెళ్లి రోజు. దాంతో రోజా వాళ్లిద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏళ్లన్నీ గడిచినా చెదరని మీ అనుబంధం.. ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ..!! అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు.’ అని రోజా పోస్టు పెట్టారు.

సంబంధిత పోస్ట్