రెండు లేగదూడలకు జన్మనిచ్చిన ఆవు

583చూసినవారు
గంగవరం మండలంలోని చిన్నూరు గ్రామం కేశవ అనే రైతుకు చెందిన ఆవు గురువారం ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఆరోగ్యమైన దూడలను ప్రసవించడంతో రైతు కేశవ సంతోషాన్ని వ్యక్తపరిచాడు. పంటలకు గిట్టుబాటు ధర లేక, పశువులపై ఆధారపడి జీవిస్తున్నామని దేవుడి దయతో సుఖ ప్రసవం అయిందని ఆనందం వ్యక్తం చేశారు. లేగ దూడలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు చిన్నూరుకు చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్