అమ్మ స్వచ్చంధ సేవ సమితి ఆధ్వర్యంలో అన్నం పరబ్రహ్మం కార్యక్రమంలో భాగంగా పీలేరు పట్టణంలోని రోడ్డు మీద ఎవరు లేని వారికి ,ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద వారి కుటుంబసభ్యులకు ఆహార పోట్లాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆస్వా ఫౌండర్ చీనేపల్లి నాగేంద్ర మాట్లాడుతూ ఇతరులకు సేవ చేయడం సామాజిక సేవ కాదు,ఇది మన బాధ్యత అని అన్నారు.అంతే కాకుండా అనాధ,వృద్ద ఆశ్రమాలు సందర్శించి నా అన్నావారు ఎవరు లేనివారికి మేమున్నాం అని భరోసా ఇస్తామని ఆయన తెలియచేసారు.ఇందులో భాగంగా ఎస్. సి కళాశాల,పాఠశాల హాస్టల్ వార్డెన్లు కుసుమ,లత వీరు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మం అనే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోసాదాయకమని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ఆస్వా సభ్యులు రాజేష్,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.