భారతీయ జనతా పార్టీ పీలేరు అసెంబ్లీ కన్వీనర్ గా కలకడ మండలం మర్రిమాను పల్లికి చెందిన డాక్టర్ పొత్తూరి శ్రీకాంత్ ని నియమించినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేస్తానన్నారు.