పీలేరుకు త్వరలో తాగునీటి సరఫరా

50చూసినవారు
పీలేరుకు త్వరలో తాగునీటి సరఫరా
పీలేరు మండలంలోని కొత్తపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ను శనివారం ఈవో గురు మోహన్ పరిశీలించారు. ఇక్కడి నుండి పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో త్రాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సమ్మర్ స్టోరేజ్ ప్రాంతంలో ఏర్పడిన పిచ్చి మొక్కలను జెసిబి సాయంతో తొలగించారు. వారం రోజులలో అన్ని పనులు పూర్తిచేసి పట్టణానికి త్రాగునీటి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్