పీలేరు మండల పరిధిలోని బాలంవారిపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహానికి సర్పంచ్ హబీబ్ బాషా ఆదివారం జలహారతి ఇచ్చారు. పీలేరు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అప్పట్లో ప్రాజెక్టును నిర్మించారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటరమణారెడ్డి, పరమాశ్, రమణ, అబీద్, నాయకులు బీడీ మహేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.