బంగారుపాళ్యం మండల పరిదోలోని రాగిమానుపెంట రోడ్డు గోవర్ధన గిరి టర్నింగ్ వద్ద ఆదివారం రాగిమానుపెంట నుండి బంగారుపాళ్యం మండల పరిధిలోని నలగాంపల్లి పి డి వి కండ్రిగ గ్రామానికి చెందిన ఎన్ పి సుధాకర్ నాయుడు కుమారుడు ఎన్ పి మురళి కృష్ణ (50) తన ద్విచక్ర వాహనం లో బంగారుపాళ్యం వైపు వస్తుండగా బంగారుపాళ్యం నుండి కిరమంద గ్రామానికి పోతున్న
టాటా ఏసీ గోవర్ధనగిరి టర్నింగ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టడంతో మురళికృష్ణ తలకు బలమైన గాయం కావడం తో మురళి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన అతనిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి పోస్టుమాస్టమ్ అనంతరం బాడీని బందువులకు అప్పగించారు.