బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామి దేవాలయం యొక్క హక్కు భుక్తము కలిగిన పార్కింగ్ గేటు వసూలు చేయుట, టెంకాయలు, పూజ సామగ్రి అమ్ముకొనుట, పాదరక్షలు భద్రపరచుట, కొబ్బరి చిప్పలు పోగు చేయుట, తలనీలాలు పోగు చేయుట మొదలగు హక్కులకు శనివారం బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎంబి. విజయకుమార్, కార్య నిర్వహణ అధికారి ఏ. మునిరాజ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.