బంగారుపాలెం మండల పరిధిలోని అరగొండ కృష్ణాపురం వద్ద రాజశేఖర్, బాలాజీ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. వారి పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించమన్నారు. అక్రమంగా గంజాయి ఇస్తే కఠిన చర్యలు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.