పూతలపట్టు: అధిక ఛార్జీలు వసూలు చేస్తే కేసులు

57చూసినవారు
పూతలపట్టు: అధిక ఛార్జీలు వసూలు చేస్తే కేసులు
సంక్రాంతి పండుగ కోసం ఊర్లకు వచ్చే ప్రయాణీకుల వద్ద ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు సోమవారం తెలిపారు. పట్టణాల నుంచి పల్లెల్లో ఉన్న బంధువులవద్దకు, పల్లెల నుంచి పట్టణాలకు సంక్రాంతికి ప్రయాణికులు వస్తుంటారన్నారు. అలాంటి వారి వద్ద ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేసినట్లు తన దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్