జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్ ఛార్జ్ నూకానమ్మ, పూతలపట్టు నియోజకవర్గం బంగారు పల్లె మండలానికి చెందిన రాయలసీమ జిల్లాల ఇన్ ఛార్జ్ పి. బి. లక్ష్మీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.