చిత్తూరు జిల్లా తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ హేమలత గురువారం ప్రారంభించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఈనెల 3 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ శిక్షణను సద్వినియోగం చేసుకొని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.