పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలంలోని వేపనపల్లి గ్రామంలో భద్రప్ప అనే రైతు మామిడి తోట పై సోమవారం రాత్రి ఏనుగులు దాడి చేసి తీవ్రంగా నష్ట పరిచాయి. తోటలో 25 చెట్ల కొమ్మలను విరిచి, కాయలను నేలపాలు చేసినట్టు బాధితరైతు వాపోయాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని రైతు కోరాడు.