పుంగనూరు: ద్వాదశి పూజలో శ్రీ మాణిక్య వరదరాజ స్వామి

71చూసినవారు
పుంగనూరు టౌన్ పరిధిలోని నగిరి వీధిలో వెలసియున్న శ్రీ మాణిక్య వరదరాజ స్వామి శనివారం ద్వాదశి పూజలు అందుకున్నారు. వేకువజామునే స్వామి అమ్మవార్ల మూల విగ్రహాలను అర్చకులు అభిషేకించి పూజాది కైంకర్యాలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం మండపంలో కొలువు తీర్చారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్