Mar 24, 2025, 09:03 IST/
మహిళలకు భద్రత కల్పించడంలో సర్కార్ విఫలమైంది: కవిత
Mar 24, 2025, 09:03 IST
మహిళలకు భద్రత కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని MLC కవిత విమర్శించారు. HYD-MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే SP చందన దీప్తికి కవిత ఫోన్ చేసి యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని.. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలన్నారు. తనను రక్షించుకునేందుకు యువతి రైలు నుంచి దూకడంతో గాయాలవగా.. ప్రస్తుతం ఆస్పతిలో చికిత్స పొందుతుంది.