నైట్​ డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ!

74చూసినవారు
నైట్​ డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ!
ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగులు నైట్​ డ్యూటీలు చేస్తుంటారు. అయితే ఈ నైట్ డ్యూటీల వల్ల దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్​ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో రాత్రి పూట ఎక్కువగా హర్మోన్లు స్రవిస్తాయి. శరీరంలో జరిగిన నష్టాలను ఇవి రాత్రిళ్ళు పూడుస్తుంటాయి. ఇదొక జీవక్రియ. అయితే, రాత్రి పూట పడుకోకుండా పగటి పూట నిద్రపోవడం వల్ల ఈ జీవక్రియ దెబ్బతింటుంది. ఎక్కువగా జీవక్రియ లోపాల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్