స్విమ్స్ ఆధ్వర్యంలో సత్యవేడు మండలం పుదుకుప్పంలో గురువారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దాసుకుప్పం వైద్యాధికారి డాక్టర్ ఎన్. గుణశేఖర్ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్ కు ప్రాథమిక దశలో గుర్తించేందుకు వీలుగా 35 ఏళ్లు దాటిన మహిళలందరూ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సత్యవేడు ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంఇఓ రవి, జడ్పీటీసీలు విజయలక్ష్మి చంద్రశేఖర్, శరవణన్ పాల్గొన్నారు.